మహిళలు ఒంటరిగా లేక ప్రమాదకరమైన అత్యవసర సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై శక్తి టీం పోలీస్ సిబ్బంది అవగాహన కార్యక్రమం నిర్వహించారు...
నందిగామ జిల్లా పరిషత్ హై స్కూల్ పాఠశాల నందు శ్రావణి శివకుమారి పద్మావతి పాల్గొని విద్యార్థులు తీసుకోవలసిన జాగ్రత్తలు వారికి వివరించారు..
ప్రస్తుతం అందుబాటులో ఉన్న దిశ చట్టం గురించి దిశ యాప్ గురించి విద్యార్థులకు వివరించారు..
మహిళల భద్రత కోసమే తమని ప్రభుత్వం నియమించింది అని ఎటువంటి అత్యవసర సమయంలో నైనా కాల్ చేయవచ్చునని, ప్రస్తుతం మహిళల భద్రత కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాల గురించి వివరించారు...
అలాగే ఆపద సమయంలో ఉన్న మహిళలు ఉమెన్ helpline 1091 కి గాని, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కి గాని, ఎక్స్ఎన్ఎక్స్ సహాయం కొరకు100 కి గాని,112 కి గాని,181 కి గాని కాల్ చేసి సమస్యను తెలియజేస్తే తక్షణం పోలీసు వారు అక్కడికి చేరుకొని తగు సహాయం చేస్తారని వివరించారు
శక్తి టీం పోలీస్ సిబ్బంది అవగాహన కార్యక్రమం