రెండు నెలలకు కలిపి ఒకేసారి పెన్షన్‌

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన వారికి పెన్షన్‌ తొలిగించారని ప్రతిపక్షాలు భారీ ఎత్తున విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వెరిఫికేషన్‌ చేసిన తర్వాత అర్హత ఉందని తేలితే వారికి రెండు నెలలకు కలిపి ఒకేసారి పెన్షన్‌ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. 5 రోజుల్లో పెన్షన్‌కార్డు ఇవ్వాలని నిర్ణయించారు. మంగళవారం 'స్పందన' కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగా 6,14,244 పెన్షన్లు ఇచ్చామనీ, పెన్షన్‌ అందలేదని పెద్ద ఎత్తున వస్తున్న వార్తలను వస్తున్నాయిని, పెన్షన్‌ అర్జీలను ఫిబ్రవరి 17 నాటికి రీ వెరిఫికేషన్‌ చేయాలని చెప్పారు


 ఫిబ్రవరి18కల్లా అప్‌లోడ్‌ చేసి, ఫిబ్రవరి 19, 20 తేదీల్లో సోషల్‌ ఆడిట్‌ చేయాలని అధికారులకు ఆదేశించారు. మార్చి 1న పెన్షన్‌ ఇవ్వాలని ఆదేశించారు. కార్డుతో కూడా అదే రోజు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఎలాంటి వివక్ష చూపకూడదని తేల్చి చెప్పారు. కొత్తగా పెన్షన్లు 6,14,244 ఇచ్చామని, అయినా పెన్షన్లు తీసేసినట్లు ఫిర్యాదులు వస్తున్నట్లు చెప్పారు.